Breaking News

‘డబుల్‌’పై బీజేపీ డ్రామాలు

Published on Fri, 07/21/2023 - 02:17

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ విమర్శించారు. దేశంలో పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర మేనని అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కిషన్‌ రెడ్డికి అధికారికంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను  సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏం ఆశించి, ఎందుకోసం ఈ రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని, పేద ప్రజల సంక్షేమం కోసం మీరేం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. 

పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే..
పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తలసాని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు తెలిపారు. కొల్లూరులో రూ. 6,700 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల  కాలనీని ఇటీవలే సీఎం ప్రారంభించారన్నారు. గతంలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల  ప్రారంభ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)