Breaking News

ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఆలోచనలు

Published on Sat, 09/02/2023 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల ఆలోచనలు చేస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశా ల్లేవని పేర్కొన్నారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లపంపిణీకి సంబంధించి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించి విలే కరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఉన్నట్లుండి వేవ్‌ మార్చితే ఫలితాలు మారతాయని భ్రమ పడుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్‌ సర్కార్‌ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను నియమించిన పార్టీ తమదన్నారు. త్వర లో జరుగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే ‘వన్‌ నేషన్‌– వన్‌ ఎలక్షన్‌’బిల్లు పెడతారనే ప్రచారం జరుగుతోందన్నారు.

దేశంలో మోదీ క్రేజ్‌ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు ఆ పార్టీ వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ రెంటికీ కలిపి ఎన్నికలు పెడితే తమకేమైనా లాభం కలుగుతుందనే యోచనలో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత షెడ్యూలు మేరకే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము ఈసీని కోరతామన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)