Breaking News

ఫుడ్ పాయిజన్ అంశం.. సీతక్క సంచలన ఆరోపణలు

Published on Thu, 11/28/2024 - 13:17

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్నారు. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కామెంట్స్ చేశారు.

మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది. రాజకీయ పార్టీ కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెడతాం.  అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతాం అని చెప్పుకొచ్చారు. 

ఇదే సమయంలో దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ విషయంలో తలసానిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. దీంతో, మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దిలావార్పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హాయాంలోనే ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నాడు. దీని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. దమ్ముంటే కేటీఆర్ దిలావార్పూర్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు.

విధ్వంసం సృష్టించడం.. ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం అని కేటీఆర్ టీం ప్రచారం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు పుట్టా సుధాకర్ ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. కేటీఆర్ నువ్వు దిలావార్పూర్ రావాలి.. నేను కూడా వస్తా.. తప్పెవరిదో తేల్చుదాం. అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ చేసిన చరిత్ర కేటీఆర్ దే. కేటీఆర్ నీకు నిజంగా నీతి చర్చకు రావాలి. వచ్చే అసెంబ్లీలో ఇథనాల్ కంపెనీపై చర్చ పెడతాం. కేటీఆర్ మీ ప్రభుత్వంలో గురుకాలలో ఎంత మంది చనిపోయారో లెక్క చెప్పమంటావా?. మంత్రులు, అధికారులు అంతా గురుకులాలలో మంచి సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. లగచర్లలో గ్రామ సభ జరుగుతుంది.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)