Breaking News

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీసులు

Published on Sat, 07/06/2024 - 06:02

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క లీగల్‌ నోటీసులు పంపించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు రూ.100 కోట్ల మేరకు నష్టపరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఆమె ఈ నోటీసులు పంపించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో– ఇసుకాసుర రాజ్యం’అంటూ సీఎం, సీతక్కతో పాటు మంత్రులపై గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు.

సామాజిక మాధ్యమాల్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఆ మేరకు అరోపణల వీడియో అసత్యమని అంగీకరిస్తూ ఒక వీడియో పోస్ట్‌ చేయాలని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్నారు. ఈ నోటీసులకు స్పందించి క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరంగా సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. జూన్‌ 24న బీఆర్‌ఎస్‌ అధికారిక సోషల్‌ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో లీగల్‌ నోటీసులు పంపించినట్టు మంత్రి తరఫు న్యాయవాది నాగులూరు కృష్ణకుమార్‌ తెలిపారు.

 ఈ మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వీడియోలో సీతక్కతో సీఎం, కేబినెట్‌ మంత్రులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్టుగా చూపడాన్ని తప్పు బట్టారు. పనిగట్టుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలతో చేస్తున్న దు్రష్పచారంతో తమ క్లయింట్, మంత్రి సీతక్క ప్రతిష్టకు తీరని విఘాతంతోపాటు, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం ఓటర్లలో ఆమెకున్న ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)