Breaking News

చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్‌..  బిగ్‌ జోక్‌ అంటూ.. 

Published on Wed, 05/31/2023 - 12:38

సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా ఫుల్‌ ఫైరయ్యారు. చంద్రబాబు రైతులను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్‌ అంటూ ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదని గుర్తు చేశారు. 

కాగా, మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?. చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు. వాలంటీర్‌ వ్యవస్థతో లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన అ‍మ్మఒడిపై ఇష్టానుసారం మాట్లాడి.. ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయలేదు?. 

రాష్ట్రంలో యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్‌. బాబు వస్తే జాబ్‌ అంటూ గతంలో మోసం చేశావు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదు. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సీఎం జగన్‌ అండగా నిలిచారు. రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు.  3300 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది సీఎం జగన్‌ మాత్రమే. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానం. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్‌ చేయగలిగినవే చెప్పారు.. చేసి చూపించారు. చంద్రబాబు అబద్దపు హామీలతో మోసం చేశారు. 

ఎంపీ అవినాష్‌ రెడ్డిని సీబీఐ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు. వివేకా కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ చెప్పారు. ఎల్లో మీడియాలో ఇష్టానుసారం చర్చలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టు జడ్డీ చేసిన వ్యాఖ్యలు అందరూ గమనించాలి. తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని జడ్జి చెప్పారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. 

ఇది కూడా చదవండి: వివేకా కేసు: ‘ఏబీఎన్‌, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి’

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)