Breaking News

చంద్రబాబు డర్టీ పొలిటీషియన్‌: మంత్రి రోజా

Published on Thu, 02/15/2024 - 14:53

 సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డర్టీ పొలిటీషియన్‌ అంటూ మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు రాహుల్‌ గాంధీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు. ఇప్పుడేమో మోదీ, అమిత్‌ షా కాళ్లు పట్టుకుంటున్నాడంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్‌ లాంటి నాన్‌ లోకల్‌ పొలిటిషియన్‌లకు ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు.

సంక్షేమ రాష్ట్రంగా సీఎం జగన్‌ ఏపీని ముందుకు నడిపిస్తున్నారన్న మంత్రి రోజా. తండ్రి బాటలోనే సీఎం జగన్‌ మైనారిటీలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.  తండ్రి అడుగు జాడల్లో ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. 80 వేలు అందిస్తున్నారని, మైనారిటీ పక్షపాతిగా వక్ఫ్ బోర్డు స్థిర చర ఆస్తులు రక్షణకు అండగా నిలుస్తున్నారన్నారు.

వైఎస్సార్‌ షాదీ తోఫా కింద లక్ష రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. డిప్యూటీ సీఎం, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌లతోపాటు 2024 ఎన్నికల్లో ఏడుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తమ నియోజకవర్గంలో కోటి 85లక్షలతో షాది మహల్ నిర్మాణం చేయడంతోపాటు మసీదుల మరమ్మత్తులకు రూ. 2 కోట్లు కేటాయించారని తెలిపారు.  మీరా సాహెబ్‌పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)