Breaking News

ముగిసిన వివాదం.. అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం

Published on Wed, 10/08/2025 - 10:40

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో (Telangana Politics) ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్‌ (Adluri Laxman) మధ్య మాటల వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌.. మంత్రి అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. ఐక్యంగా పోరాటం చేస్తాం, కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. 

తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు క్షమాపణ చెప్పారు. లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను.. మంత్రి అడ్లూరి, పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడిలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు.

సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది. మేమంతా ఐక్యంగా భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం’ అని తెలిపారు. 

సమస్య ముగిసింది: అడ్లూరి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ..‘అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని నేను కాదు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తా.. కానీ, పొన్నం వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది అని చెప్పుకొచ్చారు. 

టీపీసీసీ కీలక వ్యాఖ్యలు.. 
అనంతరం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడింది. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబ సమస్య. జరిగిన ఘటన పట్ల చింతిస్తూ మంత్రి ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు.  ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహచర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ’ అని తెలిపారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)