Breaking News

హింసను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌

Published on Wed, 11/01/2023 - 03:44

సాక్షి, హైదరాబాద్‌: ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు నైరాశ్యంలోకి వెళ్లా రని, అందుకే హింసను ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగెస్ర్‌ నేతలు ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని హిత వు చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత గత 10 ఏళ్లలో ఎక్కడా హింసకు తావివ్వలేదని.. అవహేళనలు, అవమా నాలు, కవ్వింపులు జరిగినా సంయమనం పాటించినట్లు చెప్పారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి మీద హత్యాయత్నం హేయమైన, అనాగరిక చర్య అని పేర్కొన్నారు.  పాలమూరు జిల్లాలోని 14 స్థానాలు బీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నాగం, రావుల, పి.చంద్ర శేఖర్, ఎర్ర శేఖర్‌ల రాకతో జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలలోనే నేతలకు న్యాయం జరుగుతుందని తెలుసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని, పారాచూట్‌ నేతలకు టికెట్లిచ్చారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ లో సర్వే చేస్తున్న సునీల్‌ కనుగోలు ‘కొనుగోలు’గా మారారని ఎద్దేవా చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)