Breaking News

ఇప్పటికే కూటమిలో విభేదాలు..

Published on Wed, 10/15/2025 - 22:36

నెల్లూరు టాస్క్‌ఫోర్స్‌: కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని  రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ ఆదేశిస్తేనే ఇకపై ఎవరైనా మాట్లాడా­లని స్పష్టం చేశారు. నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసు­లు­రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్డీఏ కూటమిని ఇరకాటంలో పెడు­తు­న్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాల­యం నుంచి ఆదేశాలు రాకుండా ఎవరూ స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదని హెచ్చరించారు. 

ఇక నుంచి ఎవరు మాట్లాడాలో తామే నిర్ణయిస్తామ న్నారు. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదా­లున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అస­హ­నంగా ఉన్నారన్నారు. తనను నియోజక­వర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచు­కోకపోతే సహించేదిలే­ద­న్నారు. 

నీ నియోజకవర్గంలో పార్టీ నేత­లను ఎందుకు కంట్రోల్‌ చేయలేక­పోతు­న్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు.   ప్రతి పది, ఇరవై రో­జు­లకు చిన్న ఇష్యూలు వస్తే పవన్‌­కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మాట్లా­డు­కుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొ­న్నారు. మనోహర్‌ తనకు ఫోన్‌ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా..  అంటూ అడి­గా­ర­న్నారు. మీ నియోజకవర్గంలో నాయ­కులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. 

తన డిపార్ట్‌మెంట్‌ను డీగ్రే­డ్‌ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడ­టంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా?  అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ  తిట్టడం వచ్చు.. కేకలే­యడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫ­రెన్స్‌లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)