Breaking News

‘అమరావతి పనులు 10 శాతం కూడా పూర్తవలేదు!’

Published on Thu, 09/25/2025 - 07:37

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనులు 2014–19 మధ్య కాలంలో 10 శాతం కూడా పూర్తి కాలేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అంగీకరించారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో, పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి.  

ఈ సందర్భంగా మంత్రి నారాయణ బదులిస్తూ.. ‘2014–19లో 10 శాతం కంటే తక్కువ పనులు జరిగాయి. ఇంకా 90 శాతం పనులు ఉన్నాయి. కాబట్టే.. పాత రేట్లకు కాంట్రాక్టర్లు టెండర్లు కొనసాగించలేమన్నారు. అందుకే వాటిని రద్దు చేశాం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజ­ధాని నిర్మాణం ఉండాలనే టెండర్లలో నిబంధనలు రూపొందించి  కొత్తగా పెరిగిన రేట్లకు కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చాం’ అని తెలిపారు. ప్రస్తుతం అమరావతి క్యాపిటల్‌ సిటీలో సీఆర్‌డీఏ 21 పనులు, ఏడీసీఎల్‌ 64 పనులు చేపట్టిందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల పునాదుల్లో నీళ్లు ఉండిపోయాయని, నీళ్లు తొలగించాక పునాదుల పటిష్టతను పరిశీలిస్తామన్నారు.  

రూ.50 వేల కోట్ల కాంట్రాక్టులు నవరత్నాలకేనా!  
అమరావతిలో రూ.50 వేల కోట్లతో 84 పనులకు కాంట్రాక్టుల నవరత్నాల మాదిరిగా కేవలం 9 సంస్థలకే ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో 3 వేల మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక నలిగిపోతున్నా­రన్నారు. అమరావతి పనుల్లో కనీసం సబ్‌ కాంట్రాక్టులు అయినా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సీఆర్‌డీఏ, ఏడీసీఏల్‌ కాంట్రాక్టర్లు పనులు చేసి బిల్లుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, వారు గతంలో చేసిన పాత పనులను రద్దుచేసి ప్రభుత్వం కొత్తవారికి కొత్త రేట్లకు టెండర్లు ఇచ్చారన్నారు. నవరత్నాలకు ఎల్‌1 దర్శ­న­మా? మిగిలిన వాళ్లకు జనరల్‌ దర్శనమా అని నిల­దీశారు. ఆర్థిక శాఖ వింత పోకడలతో కొత్త వెబ్‌­సైట్లు తీసుకురావడంతో పాత బిల్లులు మైగ్రేట్‌ అవ్వలేదన్నారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)