Breaking News

క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టింది తెలుగు తమ్ముళ్లే బాబూ! 

Published on Sat, 12/23/2023 - 05:43

కర్నూలు (సెంట్రల్‌): రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీ ఆస్తులను కొల్లగొట్టింది, అమ్ముకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు తమతో గుంటూరు, విజయవాడ వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడికి వచ్చి టీడీపీ నాయకులు ఆక్రమించిన క్రైస్తవ ఆస్తుల వివరాలు ఇస్తామని, దీనిపై బహిరంగ చర్చకు రావా­లని మంత్రి సవాల్‌ విసిరారు. శుక్రవారం కర్నూలులో ప్రభుత్వ అతిథి గృహం­లో ఆయన విలేకరుల­తో మాట్లాడారు.

గురువా­రం విజయవాడలో ఏర్పా­టు చేసిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్‌ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత సీఎం జగన్‌దని చెప్పారు. అమరావ­తిలో దళితుల అసైన్‌మెంట్‌ భూములను చంద్రబాబు భయపెట్టి బలవంతంగా గుంజుకున్నాడన్నారు. రేపల్లెలో 400 దళిత కుటుంబాలను వెలివేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.

చివరికి దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పి అవమానించిన వ్యక్తి ఆయన కాదా... అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్‌ దళితులపై అక్రమ కేసులు ఎత్తివేస్తే బాబుకు భయమెందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ జె.సుధాకర్, వైఎస్సార్‌సీపీ నాయ­కులు యాట ఓబులేసు, సత్తిరాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)