Breaking News

అసైన్డ్‌ భూములపై రామోజీవి రోత రాతలు

Published on Fri, 05/31/2024 - 05:22

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో­సారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు, పచ్చ మీడియా అసైన్డ్‌ భూములపై రోత రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మీడియాతో మాట్లా­డుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలనే సీఎం జగన్‌ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారద­ర్శ­కంగానే చేశారన్నారు. 

అసైన్డ్‌ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగు­దేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం రూ.5 లక్షలకు కొని రూ. కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీ­రావు దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా.. అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చి రాతలు రాసే రామోజీరావు ఈ విషయాలను ఈనాడులో ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా.. అని నిలదీశారు. 

వయస్సు పెరిగినా రామోజీ బుద్ధి మారలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నా­రని తెలిపారు. చంద్రబాబు దళితవ్యతిరేకి అని చెప్పారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అన్న చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్త­బుట్టలో పడేశారని తెలిపారు. చంద్రబాబుకు, రామోజీకి దళితుల అభ్యున్నతి ఇష్టంలేదని, అందుకే దళితులకు లబ్ధి చేకూర్చే సీఎం జగన్‌  నిర్ణ­య­ం­పై విషం కక్కుతున్నారని చెప్పారు. 

తాము చంద్ర­బాబులా దళితుల భూములను కొట్టేసి తప్పుడు పనులు ఎన్నటికీ చేయబోమన్నారు. రామోజీ వాస్తవాలు గ్రహించాలని, సీఎం జగన్‌ ప్రభుత్వంపై పిచ్చి రాతలు మానుకోవాలని అన్నారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)