Breaking News

‘చంద్రబాబు వీధి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారు’

Published on Sat, 04/22/2023 - 16:07

సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు.

అనలేదని కుటుంబం మీద ఒట్టేసి చెప్పగలవా?,  అమలాపురంలో కూడా దళితుల ఇళ్లపై దాడులు చేయించారు. మా దళితులపై ఎందుకంత కక్ష? , మమ్మల్ని అవమానించిన చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయమని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పడేయించిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టిస్తున్నారు. అదీ జగన్‌కి దళితులపై ఉన్న ప్రేమ. రాజధానిలో దళితులు ఉండకూడదని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైఎ‍ఎస్సార్‌సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలటంతో చంద్రబాబుకు వణుకు పుట్టింది.అందుకే దాడులకు‌ పాల్పడుతున్నారు. మావాళ్లపై రాళ్లతో దాడి చేశారు.కుట్రలు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడు’అని ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)