Breaking News

కృత్రిమ మేధస్సుతో వ్యవసాయ సంక్షేమం

Published on Sat, 07/22/2023 - 02:15

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మేధస్సు వినియోగం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘సాగు బాగు ప్రాజెక్టు’ తొలి దశ నివేదికను తమిళనాడు ఐటీ శాఖ మంత్రి డాక్టర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌తో కలిసి కేటీఆర్‌ శుక్రవారం విడుదల చేశారు

.డేటా ఆధారిత సలహాలు, మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ తదితరాల ద్వారా రైతాంగాన్ని బలో­పేతం చేస్తున్నట్లు  వెల్లడించారు. కృత్రిమ మేధ­స్సుతో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయో గించుకుంటూ భారత్‌లో వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే లక్ష్యంతో ‘సాగు బాగు’ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు.

ఖమ్మంలో మిరప రైతులకు ’సాగు బాగు’ 
‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ ఇన్నోవేషన్‌’ (ఏఐ4ఏఐ) నినాదంతో రాష్ట్ర ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని బిల్, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో మూడు స్టార్టప్‌ల భాగ­స్వామ్యంతో అమలుచేస్తున్నారు. సాగు బాగులో భాగంగా ఖమ్మం జిల్లాలో 7వేలమందికి పైగా మిరప రైతులు వ్యవసాయ సాంకేతిక సేవలు, ఏఐ ఆధారిత సలహాలు పొందారు. కాగా శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌ డైరక్టర్‌ రమాదేవి లంకా పాల్గొన్నారు.
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)