Breaking News

‘క్షమాపణలు చెప్పకుంటే సినిమాలు ఆడనీయం’

Published on Tue, 12/02/2025 - 11:35

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్‌ చేసిన కామెంట్లపై తెలంగాణ  నాయకులు భగ్గుమంటున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. పవన్‌ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి. పవన్ క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం. మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్లో కూడా పవన్‌ సినిమా విడుదల కాదు. పవన్‌ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడు. 

పవన్ తెలిసి మాట్లాడాడో, తెలియక మాట్లాడాడో తెలియదు.. కానీ ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో నష్టపోయాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయాం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చిరంజీవి సూపర్ మ్యాన్ ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. పవన్ కల్యాణ్‌ అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖ, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్‌ నీళ్లు తాగారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

నేతలు గరం..
ఇక, అంతకుముందు.. పవన్‌ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్‌ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్‌ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్‌ ఇచ్చారు.

పవన్ కల్యాణ్‌కు తెలంగాణపై అక్కసు ఉంటే... హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్‌లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు.  తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్‌ కల్యాణ్‌పై భగ్గుమన్నారు.

Komatireddy : తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు బ్యాన్...!

మంత్రి వాకాటి వ్యాఖ్యలు.. 
పవన్‌ తల తిక్క మాటలు మానుకోవాలి. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు. ఏపీలో మైలేజ్‌ కోసం తెలంగాణపై కామెంట్స్‌ చేయడమేంటి?. అన్నదమ్ముల్లా విడిపోయాం.. సోదరుల్లా కలిసుందాం.

అవకాశవాద వ్యాఖ్యలు: అద్దంకి దయాకర్‌ 
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.. పవన్ కల్యాణ్‌ బాధ్యతారహితంగా మాట్లాడారు. అవకాశవాద వ్యాఖ్యలు సరైనవి కాదు. ఆంధ్ర, తెలంగాణ మధ్య  చిచ్చుపెట్టేలా పవన్ కామెంట్స్ చేశారు. పవన్ మెచ్యూరిటీ పెంచుకోవాలి. ఏరోటి కాడ ఆపాట పాడటం పవన్‌కు అలవాటు అయింది అని విమర్శలు చేశారు. 

మంత్రి పొన్నం కామెంట్స్‌.. 
తెలంగాణ బిడ్డలుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ స్పందించాలి. ప్రకృతి వైపరీత్యం వస్తే.. అది వదిలేసి మాపై నిందలా?. మా దగ్గర వర్షాలు పడుతున్నాయి.. మీ దిష్టే మాకు తాకిందని మేం అంటున్నామా?. వివేకంతో మాట్లాడాలి కానీ, సినిమా డైలాగులు పేల్చకూడదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)