Breaking News

జూబ్లీహిల్స్‌ ఫలితం.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Thu, 11/13/2025 - 12:23

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు రేపు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో గెలుపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ మెజార్టీలో కాంగ్రెస్‌ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘జాబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపు పక్కా ఖాయమైంది. ఫలితాల కోసం రేపటి వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఉప ఎన్నికలో 20వేల మెజార్టీతో కాంగ్రెస్‌ గెలుస్తుంది. పోలైన ఓట్లలో 70 శాతం ఓట్లు కాంగ్రెస్‌కే పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(బీఆర్‌ఎస్‌) మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్‌ఎస్‌ తరఫున మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత, కాంగ్రెస్‌ పక్షాన నవీన్‌ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లు ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఇలా ఉన్నాయి..

  • పీపుల్స్‌ పల్స్‌ -కాంగ్రెస్ 48శాతం, బీఆర్‌ఎస్-41శాతం, బీజేపీ-6శాతం
  • చాణక్య స్ట్రాటజీస్‌- కాంగ్రెస్-46శాతం, బీఆర్‌ఎస్‌-43శాతం, బీజేపీ-6శాతం‌‌‌
  • హెచ్‌ఎంఆర్‌ సర్వే.. కాంగ్రెస్‌-48.3 శాతం, బీఆర్‌ఎస్‌- 43.18శాతం, బీజేపీ 5.84 శాతం ఓట్లు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)