Breaking News

భూపాలపల్లి లింగమూర్తి కేసుపై రాజకీయ దుమారం..

Published on Thu, 02/20/2025 - 13:28

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అవినీతిని ప్రశ్నించినందుకే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్యచేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హత్యా రాజకీయాలకు తెర లేపింది. లింగమూర్తి హత్య వెనుక గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకు లింగమూర్తిని చంపేశారు. కాళేశ్వరం అవినీతిపై రాజలింగం అనేక కేసులు వేసి పోరాడుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై రాజలింగం కేసులు వేశాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోంది. అడ్వకేట్ సంజీవరెడ్డి మృతి అనేక అనుమానాలు ఉన్నాయి.

బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి చంపించారని లింగమూర్తి భార్య చెబుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై కేసు వేసినందుకే చంపేశారని లింగమూర్తి కూతురు అంటున్నారు. గండ్ర వెంకట రమణారెడ్డిని పోలీసుల ముందు లొంగిపోవాలని కేసీఆర్ ఆదేశించాలి. అవినీతి బయటపడుతుందనే హత్యలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే నడిరోడ్డుపై వామన్ రావు దంపతులను హత్య చేశారు. నిందితుడు ఎవరో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసినా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. లగచర్ల దాడి సూత్రదారుడితో కేటీఆర్ 72 సార్లు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నేతల రాజకీయం ఇలా ఉంటుంది.

ఏ ఆధారాలతో మాపై నిందలు వేస్తున్నారు: Gandra Venkata Ramana Reddy

హరీష్ రావుకు అసలు మానవత్వం ఉందా?. కృష్ణా నీటిని ఏపీకి ఎక్కువ దోచిపెట్టిందే బీఆర్‌ఎస్‌. ఈ ఘటనను డైవర్ట్‌ చేయడానికే ఇలా మాట్లాడుతున్నారు. 15 నెలలుగా బయటకు రాని కేసీఆర్‌కు కాంగ్రెస్ గ్రాఫ్ గురించి ఏం తెలుసు?. ఎవరిని అడిగి కాంగ్రెస్ గ్రాఫ్ గురించి చెప్తున్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతూ.. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ తగ్గిందని చెబుతున్నారా?. బీఆర్‌ఎస్‌ హత్యలు చేయడం తప్ప ఇంకా ఏం చేయగలదు?. ఈ హత్యను సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సీబీసీఐడీతో విచారణ జరపాలని సీఎంను కోరుతాను. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలి. ఈ కేసును న్యాయమూర్తి సుమోటోగా తీసుకోవాలి.

గండ్ర కౌంటర్‌.. 
మరోవైపు.. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. లింగమూర్తి హత్యను మాకు చుట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ఆధారాలతో మాపై నిందలు వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు. ఈ విషయంపై కోర్టులోనే మేం చట్టపరంగా ఎదుర్కొంటాం. భూ వివాదాలతోనే హత్య జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. లింగమూర్తి హత్యకు నాకు, బీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)