Breaking News

బ్లడ్‌ శాంపిలా?.. ప్రమాణమా?

Published on Sat, 05/25/2024 - 05:29

నెల్లూరు (దర్గామిట్ట): జూదం, మద్యంతో పాటు అన్ని అవ లక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనను అప్రతిష్ట పాల్జేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ‘బెంగళూరు రేవ్‌ పార్టితో నాకు సంబంధముందని నిరూపిస్తావా? బ్లడ్‌ శాంపిల్‌ ఇస్తావా? లేక ప్రమాణం చేస్తావా?’ అంటూ ఆయన సోమి­రెడ్డికి సవాల్‌ విసిరారు. శుక్రవారం మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ­లో ఒక కారుకు తన  స్టిక్కర్‌ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆధ్వర్యంలోనే రేవ్‌ పార్టీ జరిగిందని, తన పాస్‌ పోర్ట్‌ దొరికిందని, గోపాల్‌ రెడ్డి తనకు సన్ని­హితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు.

ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరోసారి సవాల్‌ విసురుతున్నానన్నారు. కారులో నా పాస్‌పోర్టు దొరి­కిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్‌పోర్ట్‌ తన దగ్గరే ఉందని చెబుతూ... కాకాణి దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్‌ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. గోపాల్‌రెడ్డితో తనకు పరిచయమున్నట్టు ఏ ఆధారమున్నా  సోమిరెడ్డి బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. గోపాల్‌రెడ్డికి – రేవ్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్‌ పార్టీని తనకు అంట కడుతున్నారన్నారు.

క్లబ్‌కు వెళ్లడం, పేకాటాడటం, డ్రగ్స్‌ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని ఆయన సవాల్‌ విసిరారు. సోమిరెడ్డి వ్యక్తిత్వంపై గతంలో స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయని,  వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదన్నారు.  పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనన్నారు. గతంలో  కోర్టులో చోరీ ఉదంతంపై తనకు సీబీఐ క్లీన్‌ చిట్‌  ఇచ్చిందని చెప్పారు. తన సచ్చిలతను నిరూపించుకునేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, మరి సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమా? అని సవాల్‌ విసిరారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)