Breaking News

దొంగలను జైల్లో పెట్టాక సజావుగా పరీక్షలు 

Published on Fri, 04/07/2023 - 03:33

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పరీక్ష పేపర్లు లీకు చేసిన దొంగలను అరెస్టు చేసి జైలులో పెట్టాక ఇప్పుడు పరీక్షలన్నీ సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర వైద్యా రోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ నేతలు ఎన్నో కుట్రలు చేస్తున్నారని, హిందూ, ముస్లింల మధ్య కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరో పించారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి విఫలమయ్యారన్నారు. సీఎం కేసీఆర్‌ బలమైన తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేస్తుంటే బీజేపీ నేతలు సమాధులు తవ్వుతామంటున్నారని ధ్వజమెత్తారు. 

ఒక్క మెడికల్‌ కాలేజీకి ఇంత ప్రచారమా.. 
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపైనా హరీశ్‌ విమర్శ లు గుప్పించారు. నాలుగేళ్ల క్రితం మంజూరైన ఒక్క మెడికల్‌ కాలేజీ ఎయిమ్స్‌కు మోదీ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం గత ఏడాది ఒకేసారి ఎనిమిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభించిందని గుర్తు చేశారు.  కంటి వెలు­గు కార్యక్రమంలో కోటి మందికి కంటి పరీక్షలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. 

కాంగ్రెస్‌ రోజురోజుకూ బలహీనపడుతోంది 
కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందని హరీశ్‌రావు అన్నారు. సోనియాని విమర్శిస్తే కనీసం ఖండించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉందన్నారు. లోక్‌సభ నుంచి రాహుల్‌గాం«దీని తీసిపారేస్తే దిక్కు దివాణం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అలాంటి కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే నష్టపోతారన్నారు.

సెక్రటేరియట్‌ను కూలగొడతానని, ప్రగతిభవన్‌కు కాలబెడతానని అంటున్న రేవంత్‌రెడ్డి లాంటి నేతలు కావాలా? తెలంగాణను నిర్మించే కేసీఆర్‌ కావాలో ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ 
వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)