కవిత లేఖ, రేవంత్‌పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 05/31/2025 - 12:36

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. ఆర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా? అని ప్రశ్నంచారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత లేఖపై కాంగ్రెస్‌ చర్చ అంతా ఒక డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు.

వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతి చెందుతున్నాయి. శుక్రవారం ఎనిమిది కోడెలు, శనివారం ఐదు కోడెలు మరణించాయి. ఈ అంశమై కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కోడెలను రక్షించాల్సిన బాధ్యత రాజన్న దేవస్థానానిదే. కోడెలను రక్షించడానికి‌ సరైన ప్రణాళికలు రూపొందించాలి. కోడెల గదుల సంఖ్య పెంచాలన్నారు.

మరోవైపు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయి. ఆర్మీ ఛీప్ మీద మీకు విశ్వాసం లేదా?. పెహల్గాం ఘటన జరిగిన పదిహేను రోజుల్లోనే ఉగ్రవాదులను చంపాం. ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. పీవోకేను  కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?.

కవిత లెటర్‌పై చర్చ అంతా కాంగ్రెస్ ‌డ్రామా. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పుడూ కలిసే ప్రసక్తే లేదు. కవిత అరెస్టును ఆపడానికి బీజేపీతో కలవాలని చూసినప్పుడే దగ్గరకు రానివ్వలేదు. కాంగ్రెస్ ప్రొడక్షన్‌లో జరిగిందే కవిత లేఖ. బీఆర్ఎస్ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ మేము. మేము వారిని దగ్గరికి రానివ్వం. ఎంపీ ఈటల రాజేందర్‌, హరీష్‌రావు కలిశారన్న విషయం నేను వినలేదు. దీనిపై ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)