Breaking News

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో 50కోట్ల దోపిడీకి​ కాంగ్రెస్‌ ప్లాన్‌: బండి సంజయ్‌

Published on Fri, 02/21/2025 - 12:36

సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలకు దమ్ముంటే కేంద్ర బడ్జెట్‌పై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్‌ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా?. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఇదే(ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడిన వీడియో). ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు?. కాంగ్రెస్‌ పార్టీ బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్‌పై ద​మ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయండి.  కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

ఇదిలా ఉండగా.. ఈ నెల 27న మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌- కరీంనగర్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతోపాటు వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 

కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)