Breaking News

ప్రభుత్వం మారితే వీసీలు మారాలా?: మేరుగు నాగార్జున

Published on Sat, 06/29/2024 - 16:33

సాక్షి, విశాఖపట్నం/గుంటూరు: ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం హల్ చల్‌ చేశారు. అరుపులతో హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్‌ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.

యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరమన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు.

‘‘ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్‌చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం.

...గతంలో టీడీపీ అపాయింట్‌ చేసిన వీసీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కొనసాగించింది. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు. ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్‌ చేయడం సమంజసం కాదు.

...గవర్నర్‌ వీసీని అపాయింట్‌ చేస్తారు. ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదు. అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు. ఇలా ఎప్పుడైనా జరిగిందా?

...ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ అపాయింట్‌ చేసిన వారిని కాంగ్రెస్‌ ప్రభుత్వం చక్కగా పనిచేయించుకుని సాగనంపింది, అక్కడే కాదు మిగిలిన యూనివర్శిటీలు, ఉన్నత విద్యామండలిలో కూడా ఇలాగే జరిగింది. విద్యా వ్యవస్ధను నాశనం చేయద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఇకనైనా ఒక పద్దతి ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన తప్పులు ఇకనైనా సరిదిద్దుకోవాలి.

...వైఎస్‌ జగన్‌ సెక్యూరిటీపై కూడా బురదచల్లుతున్నారు. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేం కోరుకుంటున్నాం. మేం ఎక్కడా క్యాడర్‌ను ఉసిగొల్పలేదు’’ అని మేరుగు నాగార్జున పేర్కొన్నారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు