Breaking News

అలాగైతే తప్పుకుంటా

Published on Sun, 04/28/2024 - 04:48

కరీంనగర్‌ టౌన్, సిరిసిల్ల: రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచే తప్పుకుంటా... నిరూపించకపోతే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్‌ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు తన సవాల్‌ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. 

శనివారం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్‌ గౌడ్‌తోపాటు తెలంగాణ ఉద్యమకారుడు కుమార్‌ తమ అనుచరులతో కలిసి బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహా్వనించారు. బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 

కుట్రలతో నన్ను ఓడించాలని చూస్తుండ్రు 
కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి చీకటి ఒప్పందాలతో తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటుకు రూ.వెయ్యి పంచి గెలవాలని యత్నిస్తున్నారని నిందించారు. ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని, ఆయన తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వరి్ధల్లు’అని అర్థమన్నారు. 

పరారీలో దోచుకున్న కుటుంబం 
మొన్నటివరకు బోయినపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని సంజయ్‌ ఆరో పించారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉందని, వత్తాసు పలికిన పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. కేసీఆర్‌కు దోచిపెట్టడం తప్ప.. కుటుంబానికి దాచిపెట్టడం తప్ప వినోద్‌కుమార్‌ సాధించేదేమీ లేదని సంజయ్‌ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ‘సెస్‌’మాజీ చైర్మన్‌ అల్లాడి రమేశ్‌ పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)