Breaking News

అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ

Published on Thu, 09/12/2024 - 11:49

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటున్నారు  లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ కశ్మీర్‌ పర్యటనలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మనోజ్‌ ఇలా స్పందించారు.

‘జమ్ము కశ్మీర్‌లో ప్రజల వద్ద రాహుల్‌ గాంధీ అభిప్రాయాలను సేకరించాలి. అప్పుడే రాహుల్‌కు మరింత అవగాహన వస్తుంది. కావాలంటే రహస్య బాలెట్‌ విధానంలో ప్రజాభిప్రాయాన్ని చేపట్టండి. ఇక్కడి 75 శాతం మంది ప్రజలు అభివృద్ధి జరగలేదని చెబితే నా పదవికి రాజీనామా చేస్తా’ అని అన్నారు. 

అలాగే.. జమ్ము కశ్మీర్‌లో ఎవరి ప్రభుత్వం కొలువుదీరినా వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండే లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు  కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. 

ఇటీవల రాహుల్‌ గాంధీ జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎల్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ జమ్ము కశ్మీర్‌లో ఒక రాజు ఉన్నారు.  ఆయనే లెఫ్టినెంట్‌ గవర్నర్.  ఆయన జమ్ము కశ్మీర్‌ ప్రజల సంపదను బయటి వ్యక్తులకు తరలిస్తున్నారు’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

చదవండి: ‘రాహుల్‌ గాంధీ.. మీకూ మీ నాన్నమ్మ గతే పడుతుంది’

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)