Breaking News

ప్రశ్నిస్తే నేరమా?.. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం: వైఎస్సార్‌సీపీ

Published on Thu, 11/07/2024 - 15:06

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని.. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుధారాణి అనే మహిళను నాలుగు రోజుల క్రితం పోలీసులు తీసుకొచ్చారని.. ఇప్పటికీ కోర్టులో హాజరు పరచలేదని ధ్వజమెత్తారు.

దీనిపై మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. పిటిషన్ వేసినందుకు ఆమెపై మరో నాలుగు తప్పుడు కేసులు పెడతామని ఆమెని బెదిరిస్తున్నారు. రాయచోటికి చెందిన హన్మంతరెడ్డిని కూడా అలాగే తీసుకెళ్లారు. మేము పిటిషన్ వేశాక అతన్ని మదనపల్లెలో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో ఏకంగా ఎస్పీనే బదిలీ చేశారు. ఎస్పీల స్థానంలో నాన్ కేడర్ ఎస్పీలను వేస్తామని ఐపీఎస్‌లను కూడా బెదిరిస్తున్నారు. ‘కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఎఫ్‌ఐఆర్‌లను బాధితులకు ఇవ్వటం లేదు ఇలా చేయటం ద్వారా ఏం చెప్పదలచుకున్నారు?’’ అంటూ మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు.

	ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా? మితిమీరుతున్న కూటమి అరాచకాలు

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, ప్రశ్నిస్తే కేసులు పెట్టటం సరికాదని.. కాలం ఒకేలాగ ఎప్పుడూ ఉండదన్నారు. ప్రభుత్వం చేస్తోన్న తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టటం ఏంటి?. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారు. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. వారికి అన్నివిధాలా అండగా నిలబడుతున్నాం. పోలీసులు చేయ్యి చేసుకుంటే ఆ వివరాలు ఇవ్వాలని మా కార్యకర్తలను కోరుతున్నాం. సదరు పోలీసులపై ప్రైవేట్‌ కేసులు వేస్తున్నాం. టీడీపీ అధికార ట్విట్టర్‌లోనే మాపై దారుణంగా పోస్టులు పెడితే డీజీపీ ఏం చేస్తున్నారు?

ఇదీ చదివండి: వేధించకుంటే వేటే!

..వైఎస్ జగన్‌ని దారుణంగా దూషిస్తుంటే డీజీపికి కనపడటం లేదా?. మరోసారి ఆ వివరాలన్నీ మేము డీజీపికి ఇవ్వబోతున్నాం. దీనిపై ఆయన కచ్చితంగా కేసులు పెట్టించాలి. లేకపోతే సదరు పోలీసులపై కూడా ప్రైవేట్‌ కేసులు వేస్తాం’’ అని టీజేఆర్‌ హెచ్చరించారు.

	కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుంది

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)