Breaking News

ప్రధానికి మణిపూర్లో పరిస్థితిని వివరించిన అమిత్ షా

Published on Mon, 06/26/2023 - 15:47

న్యూఢిల్లీ: నెలరోజులకు పైగా మణిపూర్లో చెలరేగుతున్న అల్లర్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 

అమెరికా ఈజిప్టు పర్యటనను ముగించుకుని భారత్ చేరుకొనున్న నేపథ్యంలో ఒక రోజు ముందే మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అమిత్ షాను కలిసి మణిపూర్లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తత కొంతవరకు సద్దుమణిగిందని, అతి త్వరలోనే పరిస్థితి పూర్తిగా యధాస్థితికి చేరుకుంటుందని ఆయనన్నారు. 

మెయితీ, కుకీ తెగల మధ్య అడపాదడపా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి మిత్రపక్షాలు, పౌరసంస్థలు, పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు బైరెన్ సింగ్. 

విదేశీ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న తర్వాత ప్రధానికి స్వయంగా హోంమంత్రి మణిపూర్లో పరిస్థితిని, అక్కడ శాంతిని నెలకొల్పే విషయమై ఈ నెల 18ని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నినదించిన సమయానుకూల కార్యాచరణ గురించి ఆయనకు వివరించారు.          

అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఎప్పటికప్పుడు మణిపూర్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారని.. కేంద్రం చొరవతోనే అక్కడ  ఇప్పుడు కొంత ప్రశాంతత నెలకొందని అన్నారు. అల్లర్లు జరిగిన వెంటనే స్పందించి అక్కడ సుమారు 32 వేల మంది సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు.     

ఇది కూడా చదవండి: కర్ణాటకలో "గృహ జ్యోతి" ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)