Breaking News

కస్టడీలోకి తీసుకుని విచారించాలి

Published on Mon, 09/04/2023 - 06:05

సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుల­పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్‌ నోటీసు ఇచ్చి సమా­­ధానం అడిగింది.

సమాధానం చెప్పడంలో ఆల­స్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసు­కుని విచారణ చేయాలి. నోటీ­సులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించా­నని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్‌ పార్థ­సాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్‌ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్‌ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి.

వాళ్ల వాట్సాప్‌ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయట­పడ­తాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్‌ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్ప­జెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతి­లో దొరి­­కింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవ­లం రూ.118 కోట్లను మనోజ్‌ పార్థసాని ద్వారా పట్టు­కుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్‌ ప్రశ్నించారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)