Breaking News

కాంగ్రెస్‌తో టచ్‌లో వైఎస్‌ షర్మిల? మాణిక్‌రావు థాక్రే కీలక వ్యాఖ్యలు

Published on Fri, 06/23/2023 - 18:14

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడం ఖాయమైంది. ఈక్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌​డీకే శివకుమార్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కలిసిన సంగతి తెలిసిందే. దీంతో హస్తం పార్టీలో షర్మిల పార్టీ విలీనం అంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలకు బలాన్నిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్‌లో ఉందని.. ఆమె వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీకి చాలా లాభమని మాణిక్‌రావు థాక్రే వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను రెండు విడతలుగా  ముందుగానే ప్రకటిస్తామన్నారు.

బీఆర్‌ఎస్‌ - బీజేపీ ఒకటే అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ కోసం  గట్టిగా పోరాడుతున్నారని కొనియాడారు. భట్టి విక్రమార్క వాహనం అనేది ఎక్కకుండా వంద రోజులుగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. ఇది పార్టీకి చాలా దోహదం చేస్తుందని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 
(చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్‌ అయ్యే ఛాన్స్‌!)

వైఎస్‌ షర్మిల రిప్లై ఇదే..
ఇదిలా ఉండగా.. మాణిక్‌రావు థాక్రే వ్యాఖ్యలకు భిన్నంగా వైఎస్‌ షర్మిల ట్వీట్‌తో బదులిచ్చారు.  ‘వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి.

అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే’ అని ట్వీట్‌లో స్పష్టం చేశారు. కాగా, రాహుల్‌ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల  శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
(చదవండి: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ)

చదవండి: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)