Breaking News

చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ఎలా ఇస్తారు?

Published on Tue, 12/10/2024 - 04:04

సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీ­సు ఇచ్చారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నంచారు. ‘హై ప్రొఫైల్‌ కేసుల్లో  చంద్రబాబు,  అజిత్‌ పవార్‌లకు కేంద్ర సంస్థలు క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాను.

పవార్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల ఐటీ బినామీ ఆస్తుల కేసు, రూ.371 కోట్ల స్కిల్‌ డెవ­లప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబులకు క్లీన్‌చిట్‌ అంశం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల న్యాయ­బద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. మోదీ ప్రభుత్వం పవార్‌ పేరును క్లియర్‌ చేస్తే, ఈడీ చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ఇచి్చంది. ఈ కేసుల్లో కేంద్ర సంస్థలు తగిన ప్రమాణాల మేరకు పనిచేశాయా? తగిన ప్రక్రియను అనుసరించాయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.

ఈ రెండు కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేవని దర్యాప్తు సంస్థలు చెప్పడం వాటి విశ్వసనీయతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం సమగ్ర వివ­రణ ఇవ్వాలి’ అని నోటీసులో పేర్కొన్నారు.  సభ మంగళవారానికి వాయిదా పడటంతో దీనిపై చర్చ జరుగలేదు. ఇదే అంశంపై ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్‌... ‘ఈడీ, సీబీఐల పారదర్శక విచారణ, పనితీరుపై విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం’ అని చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)