Breaking News

బీజేపీకి 8 సార్లు ఓటు! యూపీ యువకుడు అరెస్ట్‌

Published on Mon, 05/20/2024 - 08:58

లోక్‌ సభ ఎన్నికల్లో  ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్‌ ముగిసింది. ఈ రోజు ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర పదేశ్‌కు చెందిన  ఓ యువ ఓటర్‌ చేసిన పనికి పోలీసుల చేత అరెస్ట్‌ అయ్యాడు.

నాలుగో విడత పోలింగ్‌లో యూపీలోని ఫరూఖాబాద్ పోలింగ్‌ కేంద్రంలో ఓ యువ ఓటరు ఏకంగా ఎనిమిదిసార్లు ఓటు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు షేర్‌ చేయడంతో పోలీసులు స్పందించారు.

 

ఏఆర్‌ఓ ప్రతీత్ త్రిపాఠి ఫిర్యాదు ఆధారంగా నయా గావ్ పోలీస్ స్టేషన్‌లో సదరు యువకుడిపై అరెస్ట్‌ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ యువకుడిని రాజన్‌ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.అతను ఫరూఖాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ముఖేష్‌ రాజ్‌పుత్‌కు పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంపై 8 సార్లు నొక్కి ఓటు వేసిననట్లు వీడియోలో తెలుస్తోంది.

ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్ స్పందించారు. ‘ సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవుతున్న వీడియోను గమనించాం. జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకుంటారు’అని అన్నారు. సంబంధిత పోలింగ్‌ కేంద్రంలోని అధికారులను పోల్‌ ప్యానెల్‌ సస్పెండ్ చేసింది. 

‘ప్రియమైన ఎలక్షన్‌ కమిషన్, మీరు ఇది చూశారా? ఒక  వ్యక్తి  8 సార్లు ఓటు వేశాడు.  ఇది స్పందించాల్సి సమయం’ అని కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’లో పేర్కొంది. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సైతం దినికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. 

అదేవిధంగా ‘ఈ ఘటనను ఎన్నికల సంఘం తప్పుగా భావిస్తే.. వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే బీజేపీ బూత్‌ కమిటి నిజమైన లూటీ చేసే కమిటీ అని అర్థమవుతుంది’అని అఖిలేష్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)