Breaking News

మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..

Published on Sun, 01/22/2023 - 15:44

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు.  దీనికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా రాహుల్‌తో పాటు ఈ యాత్రలో పాల్గొన్నారు.

అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం జోడో యాత్రపై ఇంతవరకు స్పందించలేదు. ఆ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర జరిగినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మమతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  మోదీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు విపక్షాలన్నీ ఎకమవ్వాలని చూస్తుంటే.. మమత మాత్రం నోరుమెదపడం లేదని విమర్శించారు.  మోదీకి, దీదీకి మధ్య   'మో-మో' ఒప్పందం ఉందని, ప్రధానిని అప్‌సెట్ చేసేలా మమత ఏ పని చేయరని ఆరోపించారు.

మోదీకి వత్తాసు..
శరద్ పవార్, కమల్ హాసన్ వంటి వారు భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపినా మమత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అధిర్ రంజన్ అన్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌ను అంతమొందించాలని మోదీ అంటే.. దీదీ కూడా ఆయనకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.

2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే మమత బెనర్జీ కూడా ఇదే విషయమై ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు. ప్రధాని మోదీకి ఎదురు నిలబడే సత్తా దీదీకి ఉందని  నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కూడా వ్యాఖ్యానించారు. దీంతో విపక్షాలను ఆమె ముందుండి నడిపించాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటికే పలువురు నేతలు రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు. శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్‌ కూడా ప్రజాభీష్టం మేరకు ప్రధాని పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు.
చదవండి:  షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)