Breaking News

పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు..సుప్రీంను చేరిన బెంగాల్ ప్రభుత్వం

Published on Sat, 06/17/2023 - 15:55

పశ్చిమ బెంగాల్:పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలనే కలకత్తా హైకోర్టు ఆదేశాలపై పశ్చిమ బంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) సంయుక్తంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ సమావేశమైన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. గురువారం నుంచి 48 గంటలపాటు పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది. 

పంచాయతీ ఎ‍న్నికల నామినేషన్ సందర్భంగా అల్లర్లు చెలరేగిన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వం వహించిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లు చెలరేగిన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. 2021 కలకత్తా మున్సిపల్ ఎన్నికల్లో, 2022లో మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండ జరిగిన నేపథ్యంలో హైకోర్టు కేంద్ర బలగాలను నియమించాలని ఎస్‌ఈసీకి ఆదేశించింది. 

జూన్‌ 9న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. అల్లరిమూకలు బాంబులు విసిరారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, సీపీఐఎంలు అధికార టీఎంసీని విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వమే అందోళనకారులకు మద్దతునిస్తోందని ఆరోపించారు.   

ఇదీ చదవండి:'కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చావడం మేలు'

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)