Breaking News

ఈడీ దాడుల మధ్య ఐప్యాక్‌ చీఫ్ ఇంటికి హుటాహుటీన వెళ్లిన మమతా బెనర్జీ

Published on Thu, 01/08/2026 - 13:50

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ- టీఎంసీల మధ్య ఫైట్‌ తారాస్థాయికి చేరింది. పశ్చిమ బెంగాల్‌లో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ చర్యతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.

ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పలు డాక్యుమెంట్లను పరిశీలించి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈడీ అధికారుల విధులకు అడ్డుపడుతున్నారని బీజేపీ ఆరోపణలు చేస్తూ, మమతా చర్యలను తీవ్రంగా విమర్శించింది.

 బీజేపీ నేతలు..సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఈడీ అధికారుల పనిలో జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధం అని ఆరోపించారు. కేంద్ర సంస్థల పనులను అడ్డుకోవడం ద్వారా టీఎంసీ తమపై ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తోందని వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి రాజకీయ వ్యూహకర్తగా ఐప్యాక్ టీం కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ప్రచారంలో టీఎంసీకి వ్యూహరచన, ప్రచార పద్ధతులు, డేటా విశ్లేషణ వంటి అంశాలను ఐప్యాక్ నిర్వహిస్తోంది. ఈడీ సోదాలు, మమతా బెనర్జీ జోక్యం, బీజేపీ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త హైడ్రామాకు దారితీశాయి. ఎన్నికల ముందు ఈ పరిణామాలు టీఎంసీ–బీజేపీ మధ్య పోరును మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)