Breaking News

కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్‌.. అక్కడ గెలిచే దమ్ముందా!

Published on Fri, 02/02/2024 - 20:49

కోల్‌కతా: పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 300 స్థానాలకు కనీసం 40 సీట్లు అయినా గెలుస్తుందో? లేదో? అనే అనుమానం కలుగుతోందని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ శుక్రవారం ముర్షిదాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ పార్టీ 300 సీట్లకు కనీసం 40 సీట్లలో అయినా గెలుస్తుందో? లేదో? అనుమానం కలుగుతోంది. ఎందుకు కాంగ్రెస్‌కు అంత అహంకాంరం? మీరు బెంగాల్‌ రండి. అప్పుడు మనమంతా ‘ఇండియా కూటమి’. మీకు దమ్ముంటే బీజేపీని వారణాసిలో ఓడించండి. మీరు గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓడిపో​వటం ఖాయం!’ అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. 

‘మేము యూపీలో గెలవము. మీరు రాజస్థాన్‌లో గెలవరు. ముందు రాజస్థాన్‌కు వెళ్లి అక్కడ గెలవండి. మీరు వారణాసి, అలహాబాద్‌లో గెలిచి మీ ధైర్యం చూపండి. మీ పార్టీ శక్తి, సామర్థ్యాలు ఏంటో నిరూపించుకోండి!’ అని సవాల్‌ విసిరారు మమతా బెనర్జీ. 

రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్రపై మమతా విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ బెంగాల్‌ బీడీ కార్మికులతో మాట్లాడిన విషయంపై ప్రస్తుతం కొత్త స్టైల్‌ నడుస్తోందని.. అది ఫొటోషూట్‌ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు కానీసం చాయ్‌ దుకాణం దగ్గరు వెళ్లని వారు.. నేడు మాత్రం బీడీ కార్మికుల వద్దకు వెళ్లారని అటువంటివారు బెంగాల్‌లో వలస పక్షులని మండిపడ్డారామె. 

ఇండియా కూటమి నుంచి వైదొలిగిన మమతా బెనర్జీ.. బెంగాల్‌లో తాము ఒంటరి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ రెండు సీట్లు కేటాయిస్తామని తెలిపిన మమతా.. తర్వాత ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు