Breaking News

‘సంతోషం’.. కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్‌పై దీదీ

Published on Fri, 05/10/2024 - 15:25

కోల్‌కతా : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్‌ ఇచ్చింది. సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై ఇండియా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముందు సుప్రీం బెయిల్‌ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారు.

కేజ్రీవాల్‌కు జూన్‌ 1 వరకు మద్యంతర బెయిల్‌ ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనంతరం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో  కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్‌ ఇవ్వడం తమకు ఉపకరిస్తుందని దీదీ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఆమె ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.

మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్‌ 1 వరకు ఆయనకు బెయిల్‌ వర్తించనుంది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చు. అయితే సీఎం హోదాలో ఎలాంటి ఫైళ్లపై అధికార సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)