Breaking News

మీరు ఆక్రమిస్తుంటే... మేం లాలీపాప్‌ తింటామా?

Published on Mon, 12/09/2024 - 19:24

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ను మరికొద్ది రోజుల్లోనే ఆక్రమించుకుంటామంటూ బంగ్లాదేశ్‌ రాజకీయ నేతలు కొందరు చేస్తున్న అతి వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ దీటైన సమాధానమిచ్చారు. అవన్నీ మతిలేని వ్యాఖ్యలంటూ ఆమె కొట్టిపారేశారు. ‘మీరొచ్చి బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమించుకుంటూ ఉంటే మేం లాలీపాప్‌ తింటూ కూర్చుంటామనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. 

‘మా భూభాగాన్ని మా నుంచి లాక్కునే సత్తా ఎవ్వరికీ లేదు. అటువంటి ఆలోచన కూడా రానివ్వకండి’అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను ప్రేరేపించే దురుద్దేశంతోనే ఓ రాజకీయ పార్టీ ఫేక్‌ వీడియోలను ఇక్కడ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. 

భారత్‌లో పరిణామాలను రాజకీయం చేయాలని చూడటం బంగ్లాదేశీయులతోపాటు బెంగాల్‌కు, ఇక్కడి ప్రజలకు కూడా క్షేమకరం కాదని మమత హెచ్చరించారు. అనవసరమైన వ్యాఖ్యల కారణంగా బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింతగా విషమించే ప్రమాదముందని కూడా మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)