Breaking News

మమతా బెనర్జీపై అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు

Published on Thu, 01/04/2024 - 13:24

కోల్‌కతా: ఇండియా కూటమిలో చీలిక మరోసారి బయటపడింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సేవ చేయడంలో మమతా బెనర్జీ బిజీగా ఉన్నారని ఆరోపించారు. మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు కోరుకోవడం లేదని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయగలదని చెప్పారు.

"మేము భిక్ష అడగలేదు. మమతా బెనర్జీ స్వయంగా తనకు పొత్తు కావాలని చెప్పారు. మమతా బెనర్జీ దయ మాకు అవసరం లేదు. మేము సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.  ప్రధాని మోదీకి మమతా బెనర్జీ సేవ చేయడంలో బిజీగా ఉన్నందున ఆమెతో పొత్తులు కోరుకోవడం లేదు.' అని అధీర్ రంజన్ చౌధరి అన్నారు.

ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఎంసీ పొత్తు గురించి అడినప్పుడు అధీర్ రంజన్ చౌధరి ఈ మేరకు స్పందించారు. వివరాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు టీఎంసీ రెండు సీట్లను ఆఫర్ చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీలు సీట్ల పంపకాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధీర్ రంజన్ చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

బీజేపీని గద్దె దింపే ధ్యేయంతో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలో టీఎంసీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును టీఎంసీనే మొదట సూచించింది. అటు.. కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: 'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)