Breaking News

కేసీఆర్‌.. ఏ ముఖం పెట్టుకొని వస్తావ్‌?: భట్టి విక్రమార్క

Published on Sun, 09/01/2024 - 05:23

సాక్షి, పెద్దపల్లి: రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇచ్చిన హామీ మేరకు నెలరోజుల్లోనే రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్ర­హం వ్యక్తం చేశారు. 

‘డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయిన మీరు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇవ్వాలని బడ్జెట్‌ కేటాయిస్తే.. మీ మాదిరిగా వాటిని ఎగ్గొట్టాలని చెప్పడానికి వస్తారా? జాబ్‌ కే­లెండర్‌ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తుంటే అవి తప్పు అని చెప్పడానికి వస్తారా? దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ అని చెప్పి ఇవ్వలేదని చెప్పడానికి వస్తారా? .. అని కేసీఆర్‌ను నిలదీశారు. 

‘నీవు, నీ కొడుకు పదేళ్లు తెలంగాణను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారు’ అని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రులు శ్రీధర్‌బాబు, పోన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి మాట్లాడారు. 

తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాట్సప్‌ గ్రూప్‌ల ద్వారా తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఉద్యోగల భర్తీ కోసం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంతోపాటు, ప్రతీ నియోజకవర్గంలో యువతకు పోటీ పరీక్షలకు తరీ్ఫదు ఇచ్చేందుకు అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని  చెప్పారు. 

జెన్‌కో, సింగరేణి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ 
రామగుండం థర్మల్‌ బీ పవర్‌ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు, అక్కడ అధికారులతో వివిధ పనులపై సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాత ఆర్‌టీఎస్‌–బీ ప్లాంట్‌ స్థలంలోనే 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ప్లాంట్‌ను జెన్‌కో, సింగరేణి సంయుక్త సహకారంతో స్థాపిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి, త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే పవర్‌ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 

2031నాటికి గరిష్టంగా తెలంగాణకి 27,059 మెగావాట్ల విద్యుత్, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకుపైగా విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేశామని వివరించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  పీఎం కుసుమ్‌ పథకం కింద రాష్ట్రంలో మరో 4వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. 

ఇందులో ప్రత్యేకంగా మహిళా సంఘాలకు ప్రాధన్యత కల్పిస్తామని భట్టి చెప్పారు  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్, విజయరమణారావు, గడ్డం వివేక్, వినోద్, ప్రేమ్‌సాగర్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)