Breaking News

17న విజయభేరికి జాతరలా తరలి రావాలి 

Published on Wed, 09/13/2023 - 01:39

సాక్షిప్రతినిధి, ఖమ్మం: హైదరాబాద్‌ వేదికగా తొలిసారి ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలు చరిత్రాత్మకం కానున్నాయని, చివరి రోజు రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి సభకు ప్రజలు జాతరలా తరలిరావాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి నేతలు, కేడర్‌ ప్రజాక్షేత్రంలోకి కదలి వెళ్లాలని సూచించారు.

సభలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు డిక్లరేషన్లు పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ప్రకటిస్తారని, ఇవి ప్రజల భవిష్యత్‌ను మార్చే పునాదిరాళ్లు అవుతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం పార్లమెంట్‌ ఇన్‌చార్జి, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆరీష్‌ నసీంఖాన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణలో లూటీ చేసి.. మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.  

సన్నాహకంలో ఆగ్రహావేశాలు 
ఖమ్మం పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశానికి ఏడు నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారితోపాటు వారి అనుచరులు హాజరయ్యారు. తమ నేతకే టికెట్‌ ఇవ్వాలని, పాత నేతలను కాదని కొత్త వారికి ఇస్తే సహించేది లేదని నినాదాలు చేశారు. మాజీ ఎంపీ వీహెచ్‌ మాట్లాడుతుండగా నినాదాలు ఒక్కసారిగా మిన్నంటాయి.

వేదికపై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండగానే కార్యకర్తలు ఆందోళనకు దిగగా... భట్టి, పొంగులేటి వారిని వారించడంతో గొడవ సద్దుమణిగింది. మొత్తంగా ఈ సన్నాహక సమావేశం చివరి వరకు రసాభాసగా సాగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)