Breaking News

అదానీ అంశంపై ప్రశ్నిస్తూనే ఉంటాం: ఖర్గే

Published on Sat, 02/11/2023 - 05:54

న్యూఢిల్లీ: అదానీ అంశాన్ని పార్లమెంట్‌ లోపలా, బయటా లెవనెత్తుతూనే ఉంటామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది చాలా పెద్ద కుంభకోణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ అంశంతోపాటు తన, పార్టీ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించడం తదితర 10 ప్రశ్నలను ఆయన ప్రభుత్వానికి సంధించారు. ప్రజల డబ్బునకు సంబంధించిన అదానీ అంశం పెద్ద కుంభకోణమని ఖర్గే పేర్కొన్నారు.

‘దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? ఆర్‌బీఐ, సెబీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా ఎందుకు చేశారు? కుంభకోణాలెన్ని జరిగినా మౌనంగా ఉన్నారెందుకు?అని ఆయన అన్నారు. వీటిపై పార్లమెంట్‌ వెలుపల, లోపల ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీటిపై ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా, నియంత మాదిరిగా వ్యవహరిస్తానంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని హెచ్చరించారు.

రాజ్యసభలో ప్రశ్నలు మాత్రమే అడిగాను తప్ప ఎలాంటి అన్‌పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదన్నారు. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ, రాజ్యసభ రికార్డుల నుంచి తన మాటలను తొలగించడంపై ఆయన.. ప్రజాస్వామ్యం పేరుతో ఏం జరుగుతోందో మీరే ఊహించుకోండని వ్యాఖ్యానించారు. తన మిత్రుడి కుంభకోణాల మకిలిని పోగొట్టేందుకు ప్రధాని మోదీ పార్లమెంట్‌ను వాషింగ్‌ మెషీన్‌లాగా వాడుకుంటున్నారని ఖర్గే ట్వీట్‌ చేశారు. 

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)