Breaking News

మీరు, మేము కాదు.. మనమంతా: కోల్‌కతా ఘటనపై మహువా ట్వీట్‌

Published on Tue, 08/27/2024 - 11:01

కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్‌జీ మెడికల్‌ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి నిరసనగా నేడు(మంగళవారం) కోల్కతా సచివాలయం నవన్ అభియాన్ ముట్టడికి జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సచివాలయం వద్ద ర్యాలీకి అనుమతి లేదని బెంగాల్ పోలీసులు తేల్చి చెప్పారు. 

తాజాగా వైద్యురాలి ఘటనపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఈ దారుణమైన హత్యాచారంపై న్యాయం కోరే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు.  ఈ విషయంలో మీరు, మేము అని కాకుండా అందరూ తమ కూతుళ్ల కోసం  రక్తం చిందిస్తారని, న్యాయం కోసం పోరాడుతారని తెలిపారు.

కాగా వైద్యురాలి ఉదంతంపై బెంగాల్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహువా ట్విటర్‌ వేదికగా ఈ  వ్యాఖ్యలు చేశారు.

"ఇది సామూహిక అత్యాచారం కాదు, ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. హడావిడిగా దహన సంస్కారాలు చేయలేదు. పోస్టుమార్టం వీడియో తీశారు. 12 గంటల్లో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఓ మృగం చేతిలో అత్యాచారానికి గురైన మన 31 ఏళ్ల కుమార్తె కోసం మనమంతా రక్తమోడుతున్నాం. మీరు, మేము కాదు.  సత్వర విచారణ, న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని గట్టిగా చెప్పండి’’ అని మహువా  ట్వీట్ చేసింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)