Breaking News

ఎక్కువ సీట్లు వచ్చినవాళ్లే సీఎం కావాలనేం లేదు: షిండే

Published on Sat, 11/23/2024 - 12:28

ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మహాయుతి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఫలితాలు వన్‌సైడెడ్‌ కావడంతో.. ఇక ప్రభుత్వ ఏర్పాటుపైకి అందరి దృష్టి మళ్లింది. మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్‌ 26వ తేదీతో ముగియనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇంతలోపే సీఎం పీఠం ఎవరికి దక్కబోతుందనే చర్చ మొదలైంది.

మహారాష్ట్రలో షిండే వారసుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కూటమికి సంబంధించిన మూడు పార్టీల నుంచి.. ముగ్గురు కీలక నేతలు రేసులో ఉన్నారు. ఏక్‌నాథ్‌ షిండేనే కొనసాగిస్తారా? లేదంటే దేవేంద్ర ఫడ్నవిస్‌ను చేస్తారా? ఇవేవీ కాకుంటే.. ‘మహా’కు సీఎం కావాలన్న అజిత్‌ పవార్‌ ఆశయం నెరవేరుతుందా? అనే చర్చ నడుస్తోంది. అయితే..

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ తరఫున దేవేంద్ర ఫడ్నవిస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్‌ ధరేకర్‌ చెబుతున్నారు. రేపు మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్‌ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. 

మరోవైపు.. షిండే ఫిటింగ్‌ మొదలైంది. గెలుపు సంబురాల్లో మీడియాతో సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడారు. అతిపెద్ద పార్టీకి సీఎం పదవి ఇవ్వాలనే రూల్‌ ఏం లేదు కదా అన్నారు. సీఎం పదవికి, సీట్లకు ఏం సంబంధం అన్నారు. అలాగే.. కూర్చుని మాట్లాడుకుని సీఎంను నిర్ణయిస్తామని అన్నారాయన. మరోవైపు ఆయన తనయుడు శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. గెలుపులో శివసేన పాత్రే సింహభాగం ఉందని, తన తండ్రే సీఎం కావాలని అంటున్నాడు. 

అదే టైంలో..  అజిత్‌ పవార్‌ వర్గం కూడా తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలని అంటోంది. ప్రజలు అజిత్‌ పవార్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని ఆయన భార్య సునేత్ర అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు సమయం పెద్దగా లేకపోవడంతో మహారాష్ట్ర సీఎం ఎవరనేది హైడ్రామాను తలపించే అవకాశమూ లేకపోలేదు.

 

ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపునకు అసలు కారణం అదేనా?

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు