Breaking News

లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం..

Published on Tue, 08/08/2023 - 18:55

ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఉద్ధవ్ థాక్రే వర్గంపై నిప్పులు చెరిగారు. హిందుత్వ భావాజాలాన్ని, బాల్ థాక్రే ఐడియాలజీని వదిలేసినందుకు విరుచుకుపడ్డారు. ఇండియా కూటమితో కలిసి కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తున్న ఉద్ధవ్ థాక్రే వర్గంపై మండిపడ్డారు. అంతేకాకుండా లోక్‌సభలోనే హనుమాన్ చాలీసాను పఠించారు.

కల్యాన్ నుంచి ఎంపీగా గెలుపొందిన శ్రీకాంత్ షిండే నేడు లోక్ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. వచ్చే రోజుల్లో యుద్ధం ఎన్డీయే వర్సెస్ ఇండియా కాదు.. స్కీం వర్సెస్ స్కాం అని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి అంటేనే అవినీతికి మరోపేరు అని విమర్శించారు. 

లోక్‌సభలో నేడు అవిశ్వాస తీర్మాణంపై చర్చలో భాగంగా షిండే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉద్ధవ్ వర్గం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత విడిపోయి ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. శివసేన కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించరని అన్నారు. చివరికి కరసేవకులపై దాడి చేసిన సమాజ్ వాదీ పార్టీతో కూడా కలిసిపోతారని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో కనీసం హనుమాన్ చాలీషా కూడా చదవనీయలేదని ఉద్ధవ్ వర్గంపై మండిపడ్డారు. ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు ఆయన నివాసం వద్ద హనుమాన్ చాలీసా పాఠనం చేస్తామని ప్రకటించిన ఎంపీ నవ్‌నీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేసి షిండే.. లోక్‌ సభలోనే హనుమాన్ చాలీసా పఠించారు. తొందరగా ముగించాలని స్పీకర్ చెప్పడంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.   

ఇదీ చదవండి: వీల్ ఛైర్‌లో మన్మోహన్‌సింగ్‌.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)