Breaking News

‘మహ’ సీఎం ఎంపిక : పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ

Published on Mon, 12/02/2024 - 15:31

ముంబై: మహరాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, గుజరాత్‌ మాజీ సీఎం విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ డిసెంబర్ 4 జరిగే  బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రేపే ఢిల్లీకి వెళ్లనున్నారు.  

మహరాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి పెద్దలు చేస్తున్న కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి పెద్దలతో ఏకాంతంగా చర్చలు జరిపేందుకు ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్‌ ఢిల్లీకి పయనమయ్యారు. 

కేబినెట్‌ పదవులు ఖరారు చేసేందుకు మహాయుతి నేతల సమావేశానికి ఏక్‌నాథ్‌ షిండే హాజరు కావాల్సి ఉంది. కానీ షిండే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.షెడ్యూల్‌ ప్రకారం.. మంగళవారం షిండే బీజేపీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాల సమాచారం మేరకు.. ఇవాళ తమ అధినేత షిండేకు.. బీజేపీ అగ్రనేతలతో సమావేశానికి సంబంధించి ఎలాంటి మీటింగ్‌ షెడ్యూల్‌ ఖరారు చేయలేదని తెలిపారు. బీజేపీ పెద్దలు మీటింగ్‌ షెడ్యూల్‌ ఖరారుపై ఎదురు చూస్తున్నారంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ అగ్రనాయకులతో చర్చలు జరిపేందుకు అజిత్‌ పవార్‌ ఢిల్లీకి బయలుదేరడం గమనార్హం.  
 

 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)