Breaking News

Madhya Pradesh Exit Poll 2023: మధ్యప్రదేశ్‌ ఎగ్జిట్ పోల్స్‌: విజయం ఎవరిదంటే..?

Published on Thu, 11/30/2023 - 17:43

భోపాల్‌: దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల(నవంబర్‌లో) వివిధ దశల్లో పోలింగ్ ముగిసింది. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.  ఈ క్రమంలో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై ఉంది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి సర్వే ఏజెన్సీల ద్వారా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు.

అయితే.. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సమాజ్‌వాదీ పార్టీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), గోండ్వానా గంతంత్ర పార్టీ (GGP) సంకీర్ణంగా పోటీలో ఉన్నాయి. మధ‍్యప్రదేశ్‌ ఎన్నికలపై ఎగ‍్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..? 

ఎగ్జిట్ పోల్ ద్వారా అంచనా వేయబడిన సంఖ్యలు కేవలం అంచనా కోసం మాత్రమే. ఎందుకంటే వాస్తవ గణాంకాలు అంచనా వేసిన వాటి కంటే చాలా భిన్నంగా కూడా ఉండవచ్చు. ఓటరు ఒక సర్వే ఏజెన్సీ అడిగినప్పుడు ఓటు వేసిన అభ్యర్థి పేరు వెల్లడించకపోవచ్చు. వేరే పేరు చెప్పవచ్చు. వివిధ ఏజెన్సీలకు వేర్వేరు సమాధానాలు ఇవ్వవచ్చు. 

పీపుల్స్ పల్స్ సర్వే

  • మొత్తం స్థానాలు-230
  • కాంగ్రెస్-117 నుంచి 139
  • బీజేపీ -91 నుంచి 113
  • ఇతరులు- 0 నుంచి 8

న్యూస్ 18 సర‍్వే

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ -112
  • కాంగ్రెస్- 113 
  • ఇతరులు- 5

సీఎన్‌ఎన్‌ సర్వే

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ-116
  • కాంగ్రెస్-111
  • ఇతరులు-3

జన్ కీ బాత్ సర్వే

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ- 100-123
  • కాంగ్రెస్- 102-125
  • ఇతరులు- 05
     

రిపబ్లిక్ టీవీ-Matrize

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ- 118-130
  • కాంగ్రెస్- 97-107
  • ఇతరులు-0-2

పోల్ స్టార్ట్

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ- 106-116
  • కాంగ్రెస్- 111-121
  • ఇతరులు- 0-6


దేనిక్ భాస్కర్

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ-95-115
  • కాంగ్రెస్-105-120

News 24-Todays Chanakya

  • మొత్తం స్థానాలు-230
  • బీజేపీ-151
  • కాంగ్రెస్-74

ఎగ్జిట్‌పోల్స్‌ పూర్తి పట్టిక కోసం..

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?