Breaking News

కేంద్రంలో కాంగ్రెస్‌ రావడం అనివార్యం

Published on Sat, 05/04/2024 - 03:40

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం అనివార్యమని, జనాభాలో అధిక శాతం ఉన్న పేద వర్గాలకు సామాజిక న్యాయం కలి్పంచేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోరాటం కొనసాగిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో స్థాపించిన సంస్థలను అమ్మడమే తప్ప.. మోదీ సర్కార్‌ కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థలేమీ లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో మధుయాష్కీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసి, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే తమకు 400 సీట్లు ఇవ్వాలంటూ మోదీ ప్రజలను కోరుతున్నారన్నారు.

 కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మధుయాష్కీ ధ్వజమెత్తారు. విదేశాలనుంచి నల్లదనం తెస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాను ఓబీసీ అని చెప్పుకునే మోదీ.. ఓబీసీలకు ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. 
 

కేసీఆర్‌ అప్పుల్లో ముంచారు 
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, అవినీతి.. అక్రమాలతో తెలంగాణను సర్వనాశనం చేశారని మధుయాష్కీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూల్చేస్తాం, పడగొడతామంటూ ఒకదిక్కు బీఆర్‌ఎస్, మరోదిక్కు బీజేపీ అవాకులు చవాకులు పేలుతున్నాయని, అందుకే తాము ఇతర పార్టీలనుంచి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చా రు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)