Breaking News

మడకశిర టీడీపీ అభ్యర్థికి ఘెర పరాభవం

Published on Sat, 02/24/2024 - 19:16

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు ఘెర పరాభవం ఎదురైంది. సునీల్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. మడకశిర పట్టణంలోని టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి ఇంటి వద్ద ఘటన జరిగింది. మడకశిర నియోజకవర్గంలో కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య వర్గపోరు సాగుతోంది.

మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్‌కు చంద్రబాబు టికెట్‌ ఖరారు చేయగా, మద్దతు కోరేందుకు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న..  తిప్పేస్వామి ఇంటికెళ్లారు. దీంతో ఇద్దరిపైనా చెప్పులతో దాడి చేసి తరిమేశారు. మడకశిర టీడీపీ గ్రూపు రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శింగనమల టీడీపీ అభ్యర్థి గా బండారు శ్రావణి నియామకంపై అసంతృప్తి భగ్గుమంది. టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లా టీడీపీ కార్యాలయంపై అసమ్మతి నేతలు రాళ్లు రువ్వారు. టీడీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: ‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)