Breaking News

హస్తం గూటికి ‘బిహార్‌ బాహుబలి’.. కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం

Published on Wed, 03/20/2024 - 21:42

బిహార్‌కు చెందిన జేఏపీ నాయకుడు పప్పు యాదవ్ హస్తం గూటికి చేరారు. తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి న్యూఢిల్లీలో అధికారికంగా పార్టీలో చేరారు. తన కుమారుడు సార్థక్ రంజన్, ఇతర పార్టీ నాయకులతో కలిసి, యాదవ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయంలో ప్రకటన చేశారు.

పప్పు యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత విలీనంపై ఊహాగానాలు చెలరేగాయి. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా పప్పు యాదవ్ 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్‌ బాహుబలిగా వ్యవహరిస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆశీస్సులతోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయశానని పప్పు యాదవ్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన పప్పు యాదవ్ ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం లేదన్నారు. లాలూ, కాంగ్రెస్‌తో కలిసి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన జన్ అధికార్ పార్టీని ప్రారంభించడానికి ముందు, పప్పు యాదవ్ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆర్జేడీ నుంచి పప్పు యాదవ్ బహిష్కరణకు గురైన తర్వాత జన్ అధికార్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)