Breaking News

‘పార్టీకి వేయండి.. లేదంటే నా అంత్యక్రియలకైనా రండి’.. ఖర్గే ఎమోషనల్‌

Published on Thu, 04/25/2024 - 16:22

బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ఒక వేళ మీరు పార్టీకి ఓటు వేసేందుకు ఇష్టపడకపోతే.. మీకోసం నేను పనిచేశానని భావిస్తే కనీసం మీరు నా అంత్యక్రియలకైనా హాజరు కావాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు.  

2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కలబురగిలో మల్లికార్జున్‌ ఖర్గే ఓడిపోయారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కలబురగి నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని కాంగ్రెస్‌ అధిష్టానం పోటీకి దింపింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉమేష్ జాదవ్‌ మరోసారి టికెట్‌ దక్కించుకున్నారు. 

ఈ తరుణంలో జిల్లాలోని అఫ్జల్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈసారి మీ ఓటు తప్పితే (కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే) నాకు ఇక్కడ స్థానం లేదని, మీ హృదయాన్ని గెలవలేనని అనుకుంటాను' అని ఖర్గే అన్నారు.  

మీరు మాకు (కాంగ్రెస్‌కు) ఓటు వేసినా వేయకపోయినా, కలబురగికి నేను మంచి  చేశానని మీరు భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి అని కాంగ్రెస్ చీఫ్ కోరారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను ఓడించేందుకు తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. నేను రాజకీయాల కోసమే పుట్టాను. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకున్నా.. ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను. రాజకీయాల నుంచి విరమించుకోనని ఖర్గే స్పష్టం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)