Breaking News

Lok Sabha elections 2024: నాలుగు రాష్ట్రాల్లో పొత్తు కాంగ్రెస్, ఆప్‌ ఒప్పందం

Published on Sun, 02/25/2024 - 04:50

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణాల్లో సీట్ల పంపకం పూర్తయింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ 4, ఆప్‌ 3 చోట్ల బరిలో దిగుతాయి. న్యూఢిల్లీ, వెస్ట్‌ ఢిల్లీ, సౌత్‌ ఢిల్లీ, ఈస్ట్‌ ఢిల్లీ స్థానాల్లో ఆప్, చాందినీ చౌక్, నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ సీట్లలో కాంగ్రెస్‌ బరిలో ఉంటాయి. గుజరాత్‌లో 24 స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో (భావ్‌నగర్, భరూచ్‌) ఆప్‌ పోటీ చేస్తాయి.

హరియాణాలో కురుక్షేత్ర స్థానంలో ఆప్, మిగతా 9 చోట్లా కాంగ్రెస్‌ బరిలో ఉంటాయి. గోవాలో మొత్తం రెండు సీట్లతో పాటు చండీగఢ్‌ లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెసే పోటీ చేస్తుంది. కాంగ్రెస్‌ నేత ముకుల్‌ వాస్నిక్, ఆప్‌ ప్రధాన కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ శనివారం ఈ మేరకు మీడియాకు వెల్లడించారు.

పంజాబ్‌లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తుతో సంబంధం లేకుండా అక్కడి 13 స్థానాల్లో విడిగానే పోటీ చేయాలని రెండు పారీ్టలూ నిర్ణయించాయి. గుజరాత్‌లో భరూచ్‌ స్థానాన్ని ఆప్‌కు కేటాయించడాన్ని దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైజల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ అహ్మద్‌ పటేల్‌ పలుమార్లు గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్‌ టికెట్‌పై తాను పోటీ చేస్తానని, దీనిపై పార్టీ అధిష్టానాన్ని కలిసి చర్చిస్తానని ఫైజల్‌ చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)